![]() |
![]() |
.webp)
అనసూయ న్యూ ఇయర్ లో సరికొత్తగా కనిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన ఫాన్స్ కి నిరాశే ఎదురయ్యింది. ఎందుకంటే బుల్లితెర మీద మంచి హాట్ గా కనిపించే అనసూయ వితౌట్ మేకప్ తో కనిపించింది. 2022 ఇయర్ ఎండింగ్ డేని ఫామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకుంది..దీనికి సంబంధించి ఒక వీడియో కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది.
ఇందులో అనసూయ ముద్దుల్లో మునిగి తేలింది. ఓ వైపు భర్త, మరోవైపు పెంచుకున్న పెట్ డాగ్, మరోవైపు చిలుక, అలాగే తన పిల్లలు అంతా కలిసి ఆమెను ముద్దులతో ముంచెత్తారు. జనరల్ గా చూస్తే సెలెబ్రేషన్స్ ని ఎవ్వరైనా బయట చేసుకుంటారు .. కానీ అనసూయ ఫామిలీతో ఎంజాయ్ చేసింది. జబర్దస్త్ లో చేసినన్ని రోజులు ఫోటో షూట్స్ తో అందరినీ అలరించేది.
కానీ ప్రస్తుతం అనసూయ మూవీస్ లో యాక్ట్ చేస్తూ బిజీ ఐపోయింది. చిన్న బడ్జెట్ మూవీస్ నుంచి భారీ ప్రాజెక్ట్స్ వరకు ఆమె ఖాతాలో ఏడెనిమిది సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం అనసూయ దృష్టి మొత్తం నటనకు స్కోప్ ఉన్న బోల్డ్ రోల్స్ లో నటించడానికి ఇంటరెస్ట్ చూపిస్తోంది. తనలోని నటిని బయటకి తీసుకొచ్చి మంచి నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తోంది.
![]() |
![]() |